విపత్తుల వాలంటీర్ల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్

HNK: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలోని సాంస్కృతి విహార్ శిక్షణా కేంద్రంలో నేడు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విపత్తుల వాలంటీర్ల శిక్షణా తరగతులను జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ప్రారంభించారు. జిల్లాలో విపత్తుల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై వాలంటీర్లకు దిశ నిర్దేశం చేశారు. జిల్లా అధికారి జయపాల్ రెడ్డి, వెంకట సతీష్ కుమార్ పాల్గొన్నారు.