రహదారి ధ్వంసం.. నిలిచిపోయిన రాకపోకలు

రహదారి ధ్వంసం.. నిలిచిపోయిన రాకపోకలు

KMR: జిల్లాలో ఆగస్టు 27వ తేదీన కురిసిన అతి భారీ వర్షానికి పెద్ద ఎత్తున రోడ్లు ధ్వంసమైన విషయం తెలిసిందే. KMRకి 4 కి.మీ. దూరంలో ఉన్న క్యాసంపల్లికి వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసమైంది. 85 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ మరమ్మతులు చేయలేదు. దీంతో గ్రామస్తులు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 10 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.