మహిళను చితకబాదిన స్థానికులు

KMR: బాన్సువాడ మండలం ఇస్లాంపురంలో పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని అనుమానంతో స్థానికులు ఓ మహిళను చితకబాది పోలీసులకు అప్పగించారు. మహిళతో పాటు ఉన్న మరో వ్యక్తి పరార్ అయ్యాడు. ఆమె బురఖా ధరించి సరైన సమాధానం ఇవ్వక పోవడంతో అనుమానం వచ్చి పిల్లలను కిడ్నాప్ చెయ్యడానికి వచ్చారని భావించి చితకబాది పోలీసులకు అప్పగించారు.