గణేష్ శోభాయాత్రలో కర్రసాము చేసిన ఏఎస్సై

గణేష్ శోభాయాత్రలో కర్రసాము చేసిన ఏఎస్సై

KMM: రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో వినాయక శోభాయాత్ర వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రఘునాథపాలెం ఏఎస్సై కే.వెంకటేశ్వర్లు కర్రసాము చేసి అలరించారు. మహిళలు కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా ముందుకు సాగారు. శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో పరిసర ప్రాంతాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. వినాయకులకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.