'ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం'

SRPT: గ్రామాల్లో అంతర్గత రోడ్లు మంచినీళ్లు,విద్యుత్ తోపాటు అనేక రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.