మళ్లీ మొదలైన ప్రజావాణి కార్యక్రమం

KNR: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు సైదాపూర్ మండలంలో సోమవారం నుంచి ప్రజావాణి కార్య క్రమం మళ్లీ ప్రారంభమైంది. గతంలో మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణిని గత కొన్నేళ్లుగా మండల కేంద్రంలో నిర్వహించలేదు. కాగా, నేటి నుంచి ప్రతి సోమవారం మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిప్యూటీ తహశీల్దార్ నాగార్జున తెలిపారు.