నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KKD: పిఠాపురంలో ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఎలక్ట్రికల్ ఏఈ ప్రభాకర్ తెలిపారు. 33/11KV పిఠాపురం సబ్ స్టేషన్ నుంచి వచ్చే 11KV ఆదర్శ ఫీడర్ వద్ద చెట్లు నరికివేత, అలాగే విద్యుత్ లైన్‌లు మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం కలుగుతుందని వెల్లడించారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.