కళను కాపాడుతున్న యువత
NTR: మైలవరం మండలం గణపవరం గ్రామంలో యువకులు తమ ఉద్యోగాలను వదిలి, కుటుంబ సాంప్రదాయ కుండల తయారీ కళను తిరిగి ప్రారంభిస్తున్నారు. మైలవరం మండలం గణపవరం గ్రామంలో ఈ యువకులు మట్టి కుండలు, వంటపాత్రలు తయారు చేస్తూ ఈ కళను పరిరక్షిస్తున్నారు. సాంప్రదాయ వ్యాపారంపై ఆసక్తి చూపుతున్న వీరు, తమకు ప్రభుత్వం నుంచి కొంత భరోసా లభిస్తే బాగుంటుందని కోరుతున్నారు.