భానుడి ప్రతాపం.. గరిష్ఠ ఉష్ణోగ్రత
PLD: జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఇవాళ క్రోసూరులో 42.2°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అవసరం అయితే తప్ప మధ్యాహ్న సమయంలో ప్రజలు బయటకి రావొద్దని హెచ్చరించింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధలు, గర్భిణిలు చాలా జాగ్రత్తగా ఉండాలని, తమ వెంట మంచినీరు ఉంచుకోవాలని సూచించింది.