కోటి సంతకాల సేకరణ నిర్వహించొద్దని దాడి..!

కోటి సంతకాల సేకరణ నిర్వహించొద్దని దాడి..!

ATP: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయవద్దని వైసీపీ ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ తాడిపత్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన జేసీ వర్గీయులు ఈ కార్యక్రమం నిర్వహించొద్దని నిర్వాహకులపై దాడి చేసి వారి వాహనాలు ధ్వంస చేసినట్లు బాధితులు వాపోయారు.