రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ADB: బజార్హత్నూర్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు ఎడ్ల బండిని ఢీకొట్టిన ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన విద్యార్థిని స్థానికులు రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.