21 ఫీట్ల ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన

21 ఫీట్ల ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన

KMR: లింగంపేట మండలంలోని ముంబాజిపేట తండా జగదాంబ సేవలాల్‌ ఆలయంలో బుధవారం ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. 21 అడుగుల ధ్వజస్తంభంతో పాటు బంజారాల ఆరాధ్య దైవం సేవలాల్‌ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు మహాహోమం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.