'జిల్లా ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కల్పించాలి'
ASR: పాడేరులోని జిల్లా ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 11 మండలాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఈ ఆసుపత్రిలో కనీస వసతలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వేసవికాలం దృష్ట్యా తాగేందుకు నీరు దొరకడం కష్టంగా మారిందన్నారు. రోగులకు ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసారు.