ఉరుములు, వడగళ్లతో వర్షం
HYD: సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ప్రాంతంలో ఇవాళ సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల స్వల్పంగా వడగళ్లు కూడా పడ్డాయి. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో సతమతమవుతున్న ప్రజలకు ఈ వర్షం వల్ల వాతావరణం చల్లబడి ఎంతో ఊరట లభించింది.