స్థలం కేటాయించాలని తహశీల్దార్‌కు వినతి

స్థలం కేటాయించాలని తహశీల్దార్‌కు వినతి

PLD: మాచర్ల పట్టణంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఏపీయూడబ్ల్యూజే యూనియన్ నాయకులు తహశీల్దార్ బందెల కిరణ్ కుమార్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ప్రెస్ క్లబ్ ఆవశ్యకత, ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని తహశీల్దార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.