పెనుకొండలో సోలార్ లైట్లు ఏర్పాటు

సత్యసాయి: పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలో ఎన్టీఆర్ కాలనీలో నూతన సోలార్ లైట్లను యునైటెడ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని సోమవారం భూమి పూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. CSR నిధులతో ఎన్టీఆర్ కాలనీలో 17 సోలార్ లైట్లను ఏర్పాటు చేశామని, మున్సిపాలిటీలో 259 సోలార్ లైట్లు ఏర్పాటు చేశారన్నారు.