చంద్రబాబు, జగన్ పేర్లతో సర్పంచ్ స్థానానికి పోటీ
BDK: జిల్లా జూలూరుపాడు మండలం గుండ్ల రేవు గ్రామానికి చెందిన వారు సర్పంచ్ స్థానానికి భూక్య చంద్రబాబు, బానోత్ జగన్ అనే పేర్లతో నామినేషన్ దాఖలు చేశారు. వీరి పేర్లు ఇలా ఉండడంతో పోటీతోపాటు ప్రచారం ఆసక్తిగా మారింది. ఈ నెల 9న నామినేషన్ల ఉపసంహరణ ఉన్నప్పటికీ ఇద్దరూ బరిలో నిలిచేందుకు మొగ్గు చూపుతున్నారు. వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు వైరా MLA రాందాస్ నాయక్ రంగంలోకి దిగినట్లు సమాచారం.