VIDEO: తల్లిపట్ల కర్కశంగా ప్రవర్తించిన కూతురు

JGL: కని,పెంచిన తల్లి పట్ల కర్కశంగా ప్రవర్తించిందో కూతురు. జగిత్యాలలోని ఇస్లాంపుర వీధిలో ఉండే బుధవ్వకు ఈశ్వరీ అనే కూతురు ఉంది. రెండురోజుల క్రితం తల్లిని అడవిలోకి తీసుకెళ్లిన కూతురు ఆమె మెడలోని ఆభరణాలు తీసుకొని పరారైంది. తిండీతిప్పలు లేక వృద్ధురాలు రెండురోజులు అడవిలోనే తిరిగింది. నిన్న కొందరు యువకులు ఆమెను గమనించి జిల్లా అధికారులకు తెలిపారు.