గుర్తు తెలియని వ్యక్తులు దాడి.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
KDP: చాపాడు(M) అన్నవరం గ్రామానికి చెందిన సత్యబాబు(45)పై సోమవారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అన్నవరం నుంచి తెల్లవారుజామున ప్రొద్దుటూరులోని మార్కెట్టుకు వెళ్తుండగా కానాపల్లె సమీపంలో దాడి చేసే గాయపరిచినట్టు బాధితుడి బంధువులు తెలిపారు. ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.