కష్టపడితే లక్ష్యాలు సాధ్యం: కలెక్టర్
KMM: కష్టపడి పనిచేస్తే ఏ లక్ష్యమైనా సాధ్యమని, విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్‌లో ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులను ఆయన సన్మానించారు. విద్యార్థులు పోటీ పరీక్షలపై దృష్టి సారించాలని, నిరంతరం పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు.