వైభవంగా నిత్య పూజయ్య స్వామి కళ్యాణోత్సవం

KDP: సిద్ధవటం మండలంలోని లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్య పూజయ్య స్వామి కోనలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ ఇష్ట కామేశ్వరి సమేత నిత్య పూజయ్య స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి కళ్యాణం నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించారు.