VIDEO: DY.CM పవన్ కళ్యాణ్ ఇలాకాలో యూరియా కొరత!

KKD: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో యూరియా కొరత ఏర్పడింది. దీంతో రైతులు రోడ్డెక్కారు. గొల్లప్రోలు విశాల సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద రైతులు ధర్నాకు దిగారు. గత 15 రోజులుగా యూరియా, ఎరువుల కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నప్పటికీ ఫలితం లేదని రైతులు వాపోయారు. ఎరువుల కొరత తీర్చాలని నిరసనకు దిగారు.