జిల్లాలో 'విజిబుల్ పోలీసింగ్' కార్యక్రమం

జిల్లాలో 'విజిబుల్ పోలీసింగ్' కార్యక్రమం

అన్నమయ్య జిల్లాలో ప్రజల భద్రతలకు భరోసా కల్పించేందుకు SP ధీరజ్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి 'విజిబుల్ పోలీసింగ్' కార్యక్రమం నిర్వహించారు. రద్దీ కూడళ్ళు, ప్రధాన వీధులు, బస్టాండ్‌లు, మార్కెట్ ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించి పెట్రోలింగ్ నిర్వహించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనుమానాస్పద అంశాలు గమనిస్తే డయల్ 112కు తెలియజేయాలన్నారు.