'రేపు మహాత్మా బసవేశ్వర జయంతి'

'రేపు మహాత్మా బసవేశ్వర జయంతి'

SRD: సంగారెడ్డిలో బుధవారం మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు జిల్లా బిసి అభివృద్ధి అధికారి జగదీష్ మంగళవారం తెలిపారు. ఉదయం 10 గంటలకు బైపాస్ రహదారిలోని బసవేశ్వర విగ్రహానికి పుష్పాలంకరణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అనంతరం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జయంతి సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకావాలన్నారు.