పొదిలి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

పొదిలి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

ప్రకాశం: పొదిలిలోని స్థానిక పోలీస్ స్టేషన్‌ను ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానంగా నాలుగు అంశాలపై ఫోకస్ చేస్తున్నామన్నారు. రోడ్డు భద్రత, మహిళల భద్రత, ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టడం, హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.