శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు

SS: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు దర్శించుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, కడప డీసీసీబీ ఛైర్మన్ సూర్యనారాయణ రెడ్డితో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.