ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి

BDK: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో చేవేళ్ల ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యాలకు నిరసనగా దమ్మపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యే పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.