అడూర్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
KMR: కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. అడూర్ నియోజకవర్గానికి ఏఐసీసీ పరిశీలుకులుగా వెళ్లిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వరుసగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు మరియు స్థానిక నాయకులతో సమావేశాల్లో బుధవారం పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ యొక్క స్థితి గతులను పరిశీలిస్తూ, ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.