'నష్టపోయిన రైతులను ఆదుకుంటాం'
ELR: తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని APCOB ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. శుక్రవారం ఉంగుటూరు మండలంలో నాచుగుంట, కాగుపాడు, కాకర్లమూడి, దొంతవరం తదితర గ్రామాలలో నేలకు ఒరిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చేబ్రోలు సొసైటీ ఛైర్మన్ కడియాల రవిశంకర్, కూటమి నాయకులు పాల్గొన్నారు.