దేవుడి సన్నిధిలో ప్రాణాలు విడిచిన స్నేహితులు

Vsp: విశాఖ సింహాచలం అప్పన్న సన్నిధిలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఇంటీరియర్ డిజైనర్ పతి దుర్గ స్వామి నాయుడు (32) సహా అతని స్నేహితుడు కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు (29) ప్రాణాలు కోల్పోయారు. దీంతో విశాఖ కేజీహెచ్ దగ్గర బంధువుల రోదనలు మిన్నంటాయి. గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. ఎంత మంది ఓదార్చినా.. ఎవరి తరం కావడం లేదు. అంతగా కన్నీటి పర్యంతం అవుతున్నారు.