మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న.. నూతన షాపులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 294 లిక్కర్ షాపుల లైసెన్స్ గడువు NOV 30తో ముగియనుంది. NOV 27 నుంచి పాత షాపులకు సరఫరా నిలిపివేయనుండగా, 28 నుంచి కొత్త షాపులకు మద్యం కేటాయింపు ప్రారంభమవుతుంది. డిపో కోడ్లు, QR కోడ్ల తయారీ జోరుగా సాగుతోంది. DEC1 నుంచి కొత్త షాపుల్లో అమ్మకాలు ఆరంభం కానున్నాయి. సర్పంచ్ ఎన్నికలతో కలిసి కొత్త షాపుల ప్రారంభం జరగనుండటం ఆసక్తికరంగా మారింది.