బీహార్ ఫలితాలపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ప్రజలు నిజంగా ఎటు ఓటేశారో, లేక EVM మెషీన్లు ఫలితాలు నిర్ణయించాయా అనేది అర్థం కావడం లేదు' అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అనేక అనుమానాల మధ్య ఎన్నికల కమిషన్(EC) తన పని కొనసాగిస్తోందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి.