చలివేంద్రం ప్రారంభించిన సీఐ

చలివేంద్రం ప్రారంభించిన సీఐ

SRD: వాసవి మా ఇల్లు సేవా సంస్థ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సీఐ రమేష్ మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు తోపాజి అనంత కిషన్, నాయకులు సుధాకర్, శ్రీహరి పాల్గొన్నారు.