గూడూరులో ఆర్డీవో సందీప్ పర్యటన

KRNL: పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా గూడూరు మండలం ఆర్.ఖానాపురంలో ఆర్డీవో సందీప్ కుమార్ పర్యటించారు. మండల తహశీల్దార్ వెంకటేశ్ నాయక్‌తో కలిసి అంగన్వాడీ కేంద్రాలు, నీటి కుంటలు, నీటి స్టోరేజ్ ట్యాంకులు, ఎంపీపీ స్కూళ్లను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో పాఠాలను చదివించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులను పరిశీలించారు.