విద్యుత్ షాక్‌కు గురైన విద్యార్థులకు పరామర్శ
E.G: రాజమండ్రి అనుశ్రీ థియేటర్ వద్ద ట్రైనింగ్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న స్కూల్‌లో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బుధవారం విద్యుత్ ఘాతానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ భరత్ రామ్ విద్యార్థులను పరామర్శించారు.15వవార్డు చెందిన యన్ రమేష్, 27వ వార్డు చెందిన ఉజ్వల ఈశ్వర సాయి విద్యార్థులు మామిడికాయలు కోసే క్రమంలో విద్యుత్ ఘాతానికి గురయ్యారు.