పాఠశాలకు నారా బ్రాహ్మణి దాతృత్వం
సత్యసాయి: లేపాక్షి మండలం పూలకుంట జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం హెరిటేజ్ సంస్థ తరఫున నారా బ్రాహ్మణి రెండు కంప్యూటర్లు, ఒక ప్రింటర్‌ను అందజేశారు. రాబోయే రోజుల్లో ల్యాబ్‌కు సంబంధించిన పరికరాలు, బుక్స్ కూడా అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. విద్యార్థులకు మెరుగైన విద్య, సదుపాయాలు కల్పించడంలో తాను భాగస్వామి అవుతామని పేర్కొన్నారు.