ఈనెల 22న హనుమాన్ శోభాయాత్ర

ఈనెల 22న హనుమాన్ శోభాయాత్ర

SKLM: శ్రీకాకుళంలో ఈ నెల 22న హనుమాన్ శోభాయాత్రను నిర్వహించనున్నట్లు వీహెచ్పీ (విశ్వ హిందూ పరిషత్) జిల్లా అధ్యక్షుడు లోకనాథం ఆనందరావు తెలిపారు. బుధవారం శ్రీకాకుళంలో ఉన్న కార్యాలయంలో ఆయన మాట్లాడారు. శాంతి సామరస్యం వెల్లి విరిసేలా ఈ కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. అనంతరం కార్యక్రమ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.