VIDEO: బంగారు ఆభరణాలతో గజ వాహనంపై శ్రీమహాలక్ష్మి

CTR: వరలక్ష్మి వ్రతం కావడంతో పుంగనూరులో అమ్మవారి ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.పట్టణంలో శ్రీమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు భక్తి శ్రద్ధలతో, శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. ఉత్సవ మూర్తిని దేవస్థానం మండపంలో కొలువుంచారు. నూతన పట్టువస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి గజ వాహనంపై కొలువు తీర్చారు.