VIDEO: బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

WGL: రాయపర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని గాంధీ చౌక్ నుంచి కొత్త రాయపర్తి చౌరస్తా వరకు జాతీయ జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో భారీ ఎత్తున యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మండల అధ్యక్షుడు వీకే రవి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.