క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి: మాజీ మంత్రి

WNP: పెబ్బేరు మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో క్రికెట్ పోటీలను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. క్రీడలు శరీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, చిన్నతనం నుంచి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని, క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరు గెలుపు ఓటములను సమానంగా భావించాలన్నారు.