ఇరిగేషన్ పనులు మరమ్మతులకు రూ.2.50 కోట్లతో ప్రతిపాదనలు

ఇరిగేషన్ పనులు మరమ్మతులకు రూ.2.50 కోట్లతో ప్రతిపాదనలు

AKP: కోటవురట్ల, పాయకరావుపేట మండలాల్లో ఇరిగేషన్‌కు సంబంధించి మరమ్మతులకు రూ.2.50 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు ఇరిగేషన్ ఏఈ రాజేష్ తెలిపారు. గురువారం కోటవురట్లలో మాట్లాడుతూ.. పంట కాలవలు, ఆనకట్టలు, గేట్లు మరమ్మతులకు మొత్తం 22 పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. సాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.