హాలియాలో జూదం స్థావరాలపై పోలీసుల దాడి
NLG: హాలియాలో జూదం ఆడుతున్న స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఎస్సై సాయి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. అందర్-బహర్ ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు పరారయ్యారు. వారి వద్ద నుంచి రూ. 2,760 నగదు, 4 మొబైల్ ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించాడు.