'వారంలోగా నిర్మాణ పనులు ప్రారంభించాలి'
MDK: ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను వారంలోగా ప్రారంభించాలని ఎంపీడీవో షాకీర్ అలీ పేర్కొన్నారు. పెద్ద శంకరంపేట ఎంపీడీవో కార్యాలయంలో నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంజూరైన లబ్ధిదారులు వారంలోగా పనులు చేపట్టకుంటే రద్దు ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందని వివరించారు.