వాహనదారులకు ఎస్సై హెచ్చరిక
PPM: ద్విచక్ర, ఆటోలు నడిపే వారికి లైసెన్స్ లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పాచిపెంట ఎస్సై లాలం అర్జున్ హెచ్చరించారు. శుక్రవారం పాచిపెంట మండలం పి.కొనవలస జంక్షన్లో వాహన తనిఖీలు నిర్వహించారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్లారదన్నారు. లైసెన్సు లు లేకుండా వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు.