ఆ వీడియోలు ఫేక్: కేంద్రం
రూ.22 వేల పెట్టుబడితో నెలకు రూ.3.5 లక్షల ఆదాయం పొందొచ్చని ప్రధాని మోదీ ప్రమోట్ చేస్తున్న వీడియో ఫేక్ అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. ఇది ఏఐ జనరేటర్ వీడియో అని పేర్కొంది. మోదీ లేదా భారత ప్రభుత్వం ఇటువంటి ఏ పెట్టుబడి పథకాన్ని ఆమోదించలేదని స్పష్టం చేసింది. ఇలాంటి పోస్టులతో ఉన్న లింక్‌లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని సూచించింది.