గుంతల మయంగా ప్రధాన రహదారి

గుంతల మయంగా ప్రధాన రహదారి

SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ నుంచి కానుకుంట వెళ్లే రహదారి గుంతలమయంగా మారిందని స్థానికులు తెలిపారు. స్వల్ప వర్షం పడినా రోడ్డుపై నీరు నిలిచి బురదగా మారుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రుల్లో ప్రయాణించాలంటే వాహనదారులు నరకం చూస్తున్నారని వాపోయారు. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.