18న శ్రీ బుగ్గ సంగమేశ్వర దేవస్థానం హుండీ లెక్కింపు

ATP: గుంతకల్లు మండలం బుగ్గ సంఘాల గ్రామంలో వెలసిన శ్రీ బుగ్గ సంగమేశ్వర దేవస్థానం హుండి ఈనెల 18న లెక్కించనున్నట్లు ఆలయ ఈవో ఏ. కృష్ణయ్య తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కమిటీ, భక్తులు, గ్రామ పెద్దలు, దేవాదాయ శాఖ, అనంత గ్రామీణ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారన్నారు.