నూతన విద్యుత్, విత్తన బిల్లులు దగ్ధం
AKP: కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తున్న నూతన విద్యుత్, విత్తన బిల్లులను వ్యతిరేకిస్తూ అచ్యుతాపురం మండలం కొండకర్ల, తిమ్మరాజుపేట గ్రామాల్లో సోమవారం రైతులు నిరసన తెలిపారు. బిల్లుల ప్రతులను దగ్ధం చేశారు. ఆ బిల్లుల వలన వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం చేకూరుతుందని, వాటిని ఉపసంహరించుకోవాలని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు డిమాండ్ చేశారు.