అర్హులకు షరతులు లేకుండా లబ్ది కలిగించాలని వినతి

WGL: ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో అర్హులకు షరతులు లేకుండా లబ్ధి కలిగించాలని కోరుతూ.. నెక్కొండ మండలం ఎమ్మార్వోకు బీఆర్ఎస్ నేతలు గురువారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నియమాల పేరిట పేదల్ని దూరం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఈదునూరి యాకయ్య, మాతంగి రాజు, బొడ్డుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.