'భూముల ఆక్రమణ.. చర్యలు తీసుకోండి'

'భూముల ఆక్రమణ.. చర్యలు తీసుకోండి'

NLR: తమ పూర్వీకుల నుంచి వస్తున్న భూములను కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని బాధితుడు పోనిపాక కన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాపూరు తహసీల్దార్‌కు వినతి పత్రం అందచేశారు. దాదాపు 60 ఏళ్ల క్రితం ప్రభుత్వం కేటాయించిన భూములకు సంబంధించి 10 నుంచి 15 మంది ఎస్సీ వర్గాల వారికి పట్టాలు ఉన్నాయన్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలన్నారు.